![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-156 లో.. పార్క్ లో కేశవ, శైలు మాట్లాడుకోవడం వింటారు అందరు. ఇక కన్నా పల్లీలు అమ్ముకునేవాడిలా రెడీ అయి కేశవ దగ్గరికి వస్తాడు. అతడిని చూసి నువ్వేంట్రా ఇక్కడ అని కేశవ అడుగుతాడు. డిగ్రీ ఫెయిల్యూర్ గాడిని ఇలా కాకుండా ఎలా ఉంటానని కన్నా అంటాడు. అప్పుడు కేశవకి విషయం అర్థమవుతుంది. అంటే మొత్తం విన్నావా అని కేశవ అంటాడు. అందరం విన్నామని కన్నా అంటాడు. ఇక శైలుని వెళ్ళిపోమంటాడు కేశవ. నన్ను వెళ్ళిపోమంటే నేను బ్రేకప్ చెప్పేస్తానని అనేసి శైలు కోపంగా వెళ్ళిపోతుంది. ఇక మహా, పెద్ది, చక్రి అంతా కలిసి కేశవని ఓ ఆట ఆడుకుంటారు. ఏంటన్నయ్యా అని కేశవ అడుగగా.. నాకేం తెలుసు నేను అమాయకచక్రవర్తిని అని పెద్ది, నేను మహాంకాళిని కదా అని మహా అంటుంది. మాతో అబద్దాలు చెప్పి ఇలా పార్క్ కి వస్తావా అని మహా అనగానే లేదండి రావాల్సి వచ్చిందని కేశవ అంటాడు.
ఇక పార్క్ లో అందరు కళ్ళకి గంతలు కట్టుకొని ఆడుతుంటే మహా కాసేపు ఆడి పక్కకి వెళ్ళి కూర్చుంటుంది. తను అలా వెళ్ళడం చూసి చక్రి తన పక్కన వెళ్ళి కూర్చుంటాడు. ఎప్పటి నుండో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానని చెప్తాడు. చెప్పండి అని మహా అనగానే చక్రి చెప్పబోతుంటే అక్కడ దూరంగా గొడవ జరుగుతుంది. నారాయణతో సెక్యూరిటీ గొడవపడుతుంటాడు. ఇక అది చూసి అక్కడికి అందరు వస్తారు. ఏం అయిందని పెద్ది,మహా, చక్రి, కేశవ, కన్నా అడుగుతారు. పార్క్ లోకి వచ్చి తాగుతున్నాడు.. ఇక్కడ వద్దని చెప్తే గొడవ చేస్తున్నాడని సెక్యూరిటీ చెప్తాడు. దాంతో అందరు రిక్వెస్ట్ చేస్తారు. ఇక నారాయణని అందరు తిట్టేసి ఇంటికి వెళ్తారు.
అతడి గురించి మాకు తెలుసు అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా అతన్ని తీసుకురామని చక్రి అంటాడు. అసలు ఆ మందు బాటిల్ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందని మహా అనగానే నారాయణ అంతా చెప్తాడు. ఇక మహా కోప్పడుతుంది. ఆ తర్వాత అందరు నారాయణని తిడతారు. మరోవైపు మళ్ళీ కేశవ షాప్ దగ్గరికి శైలు వస్తుంది. బ్రేకప్ చెప్పినా నేనే తగ్గి వచ్చాను ఎందుకు ఏంటి అని అడగవా అని శైలు అనగానే ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా వెంటపడటం మగాడి సంస్కారం కాదని కేశవ అంటాడు. ఇక కేశవపై శైలు కోప్పడి వెళ్ళిపోతుంది. మరోవైపు మహాకి డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు చక్రి. ఆ తర్వాత నారాయణ తినేది చూసిన చక్రి అతడిని అసహ్యించుకుంటాడు. అప్పుడే చక్రికి లాయర్ నుండి కాల్ వస్తుంది. విడాకులు కావాలని అన్నారు కదా అని లాయర్ అనగానే మా ఆవిడ విడాకులు కావాలని చెప్పింది నేను కాదని చక్రి అనగానే మీరు ఇలా మాటలు మారిస్తే ఎలా మీరే ఏదో ఒకటి డిసైడ్ అయి చెప్పండి.. ఆ తర్వాత నేను ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తానని చక్రితో లాయర్ చెప్పి కట్ చేస్తాడు. అసలు ఆ విడాకుల విషయాన్ని ఎలాగైనా ఆపాలని చక్రి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |